Teluguinfo.com :: sachin praises chenai. - Naren Janyavula

సచిన్‌ ప్రేమించింది?

చెన్నై: క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందుల్కర్‌ చెన్నైని కొనియాడారు. తాను ఎప్పుడు ఇక్కడ ఆడినా తనపై అద్వితీయమైన ప్రేమ, ఆప్యాయతలను పంచిందన్నారు. ప్రజలు తనకు మద్దతుగా నిలిచారన్నారు. ప్రొ కబడ్డీ వేదిక దిల్లీ నుంచి చెన్నైకి మారింది. ‘తమిళ్‌ తలైవాస్‌’ ఇక్కడ తొలి మ్యాచ్‌ ఆడుతుండటంతో ఆ జట్టు సహ యజమాని సచిన్‌ మ్యాచ్‌ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు.
‘సొంత వేదికలో తమిళ్‌ తలైవాస్‌ మ్యాచ్‌ చూసేందుకు రావడం ఆత్రుతగా అనిపించింది. ఇక్కడ ఎప్పుడు క్రికెట్‌ ఆడినా అభిమానులు నన్ను ఆదరించారు. ప్రేమించారు. మద్దతు ఇచ్చారు. కబడ్డీని ఆస్వాదిస్తూ అలాంటి మద్దతే ఇప్పుడు తమిళ్‌ తలైవాస్‌కు ఇవ్వాలని కోరుకుంటున్నా’ అని అన్నారు.