Teluguinfo.com :: kohli says then only wwe are number one. - Naren Janyavula

కోహ్లీ: అప్పుడే మేం నంబర్‌వన్‌

బెంగళూరు: సొంతగడ్డపై సాగిస్తున్న విజయపరంపరను విదేశాల్లోనూ కొనసాగిస్తే టీమిండియా ప్రపంచంలో అత్యుత్తమ వన్డే జట్టుగా ఎదుగుతుందని విరాట్‌ కోహ్లీ అన్నారు. ప్రస్తుత టీమిండియా గత జాతీయ జట్లు అన్నింటికంటే గొప్పగా పేరు తెచ్చుకుంటుందని దిగ్గజ క్రికెటర్‌ సునీల్‌ గావస్కర్‌ ప్రశంసించిన నేపథ్యంలో కోహ్లీ స్పందించారు.
‘వారి (గావస్కర్‌) ప్రశంస గొప్పది. కొన్నేళ్ల పాటు టీమిండియాకు ఆడిన వ్యక్తి మమ్మల్ని అభినందించడం బాగా అనిపిస్తోంది. కానీ ఈ యువ జట్టు ఇంకా చాలా దూరం ప్రయాణించాలి. ప్రస్తుతం మేం సొంతగడ్డపై ఆడుతున్నాం. మనకు అనుకూలించని విదేశీ పిచ్‌లపై విజయ పరంపర కొనసాగిస్తే హాయిగా కూర్చొని చాలా సాధించామని సంబరపడొచ్చు. మేమిప్పటికే ఆసీస్‌పై సిరీస్‌ గెలిచాం. అందుకే రిజర్వు బెంచ్‌ సత్తా పరీక్షించాం. వారికీ అవకాశాలు ఇవ్వాలి కదా! ఉమేశ్‌ నాలుగు వికెట్లు తీశాడు. షమీ కూడా ఫర్వాలేదు. నేనెప్పటికీ ప్రయోగాలకు వెనకాడను. ఓ ప్రయోగం విఫలమైతే మరోటి చేస్తా తప్ప ప్రయత్నం ఆపను’ అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.