Teluguinfo.com :: yuvathi pai hatya hatyacharam. - Naren Janyavula

వెంటాడి.. వేటాడి కిరాతకంగ యువతిపై అత్యాచారం.. హత్య

ఆమె తల్లిదండ్రుల్లేని అభాగిని.. ఓ కామాంధుడు వెంటాడి వేటాడి అఘాయిత్యానికి పాల్పడ్డాడు.. జరిగిన అన్యాయానికి కుంగిపోకుండా ఆమె పోలీసులను ఆశ్రయించింది. వారు అరెస్టుచేసి జైల్లో పెట్టారు. బెయిల్‌పై బయటకు వచ్చిన అతడు మళ్లీ లొంగదీసుకుని అత్యాచారానికి పాల్పడి హతమార్చాడు. భూపాలపల్లి జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం కాటారానికి చెందిన గంట పోశమ్మ, సమ్మయ్యలకు నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు. ఇద్దరు కుమార్తెలకు పెళ్లిళ్లు చేశాక తల్లిదండ్రులు ఇద్దరూ మృతి చెందారు. దీంతో మిగిలిన ఇద్దరు కుమార్తెలు, కుమారుడు కూలీ పనులు చేసుకుంటూ బతుకుతున్నారు. మూడో అమ్మాయి సుగుణకుమారి(24)పై గత ఏడాది అదే గ్రామానికి చెందిన గాలి సారయ్య అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ యువతి ఫిర్యాదుతో పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. ఇటీవలే బెయిలుపై బయటకు వచ్చిన సారయ్య కేసును ఉపసంహరించుకోమని ఒత్తిడి చేయడం మొదలుపెట్టాడు. లేదంటే తనతో కాపురం చేయాలంటూ బెదిరించి లొంగదీసుకున్నాడు. గురువారం సద్దుల బతుకమ్మ వేడుకల పేరుతో పొరుగూరికి తీసుకువెళ్లిన సారయ్య రాత్రి కాటారం సమీపంలోని మల్బరీ తోటలోకి తీసుకెళ్లాడు. అక్కడ ఇద్దరి మధ్యా ఘర్షణ తలెత్తింది. దీంతో ఆమెను కొట్టి అత్యాచారం చేసి హతమార్చాడు. శవాన్ని అక్కడున్న పైపులైన్‌ గుంతలో పడేసి ట్రాక్టర్‌తో పూడ్చివేశాడు. విషయం పోలీసులకు తెలియడంతో శవాన్ని వెలికితీసి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Click to Write a Comment ×