Teluguinfo.com :: ఇక్కడ మహేష్ బాబు హీరో.. అక్కడ మాత్రం విలన్.! - Naren Janyavula

ఇక్కడ మహేష్ బాబు హీరో.. అక్కడ మాత్రం విలన్.!

ఇద్దరు ప్రముఖ హీరోలు ప్రతినాయకులుగా నటిస్తే..! ఈ మాటే కాస్త కొత్తగా ఉంది కదూ! అన్నీ అనుకున్నట్టుగా జరిగితే మాత్రం ఆ కొత్తదనాన్ని చూసేయొచ్చు కూడా. తెలుగు, తమిళంలో అగ్ర కథానాయకులుగా ఉన్న మహేష్‌బాబు, విజయ్‌ ఇద్దరూ తెరపై ప్రతినాయకులుగా కనబడే అవకాశముంది. దీనికి సంబంధించి ప్రముఖ దర్శకుడు మురుగదాస్‌ వీరిద్దరీ ఓ స్టోరీ లైన్‌ వినిపించారని కోలీవుడ్‌ సమాచారం. తెలుగులో విజయ్‌ ప్రతినాయకుడిగా, తమిళంలో మహేష్‌బాబు ప్రతినాయకుడిగా ఉండేలా ఓ కథను మురుగదాస్‌ ఇద్దరికీ వినిపించాడని.. అయితే దీనిపై వారు ఇంకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని కోలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. ఆయన చెప్పిన కథ నచ్చి చిత్రం పట్టాలెక్కితే మాత్రం.. సినీ అభిమానులకు కొత్త తరహా అనుభూతి ఖాయం. మహేష్‌, విజయ్‌ దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి మరి!