Teluguinfo.com :: భరత్ అను నేను వచ్చేది ఏప్పుడు.? , Bharath Anu Nenu release date update. - Naren Janyavula

"భరత్ అను నేను" వచ్చేది ఏప్పుడు.?

కొరటాల శివ దర్శకత్వంలో 'భరత్ అనే నేను' సినిమా తెరకెక్కుతోంది. మహేశ్ కథానాయకుడిగా నటిస్తోన్న ఈ సినిమాలో, ఆయన సరసన కైరా అద్వాని కనిపించనుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. ఈ మూవీలో మ‌హేష్ ముఖ్య‌మంత్రిగా కనిపించ‌నున్నాడు. స్పైడర్ షూటింగ్ కొనసాగుతుండగానే కొరటాల శివ దర్శకత్వంలో భరత్ అను నేను సినిమాను ప్రారంభించాడు మహేష్. ఈ సినిమాపై భారీ అంచనాలే పెట్టుకున్నారు సినిమా యూనిట్. ఇందులో మహేష్ బాబు సీఎం గా కనిపించబోతున్నాడన్న విషయమే ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెరిగాయి.
షూటింగ్ ఆల‌స్యం కావ‌డంతో వచ్చే ఏడాది సంక్రాంతికి ఆల్రెడీ బెర్తులు బుక్ అయిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇక పెద్ద సినిమాల దృష్టి వేసవి మీద పడింది. నెక్స్ట్ సమ్మర్లో నాలుగైదు భారీ సినిమాలు రిలీజయ్యే అవకాశముంది. అందులో ముందుగా ‘భరత్ అను నేను'కు ముహూర్తం కుదిరిందట. షూటింగ్ ఆల‌స్యం కావ‌డంతో సంక్రాంతి రేస్ నుంచి త‌ప్పుకుంది.. తాజాగా వేస‌వి సెల‌వుల్లో ఈ మూవీని రిలీజ్ చేయ‌నున్నారు..
ఓవర్సీస్ థియేటరికల్ రైట్స్ ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ వారి అంచనాలకు తగ్గట్టుగానే ఉంది. తాజాగా ‘భరత్ అను నేను'కు సంబంధించి ఓవర్సీస్ థియేటరికల్ రైట్స్ కు సంబంధించిన నంబర్లు వెలుగు చూశాయి. ఏకంగా 18.18 కోట్ల రూపాయలకు ఈ సినిమా థియేటరికల్ రైట్స్ అమ్ముడు బోయాయని సమాచారం. కేవలం ఒక్క తెలుగు వెర్షన్‌లోనే థియేటరికల్ రైట్సే భారీగా అమ్ముడయినట్టు తెలుస్తోంది.
ఏప్రిల్ 27న రిలీజ్ మహేష్ బాబు-కొరటాల శివ కాంబినేషన్లో ‘శ్రీమంతుడు' తర్వాత వస్తున్న ఈ సినిమాను ఏప్రిల్ 27న రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. అధికారిక ప్రకటన చేయకున్నా.. ఈ మేరకు మిగతా నిర్మాతలకు హింట్స్ ఇచ్చేశారు. వచ్చే వేసవికి అల్లు అర్జున్-వక్కంతం వంశీల ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా'.. రామ్ చరణ్-సుకుమార్‌ల ‘రంగస్థలం'తో పాటు మరికొన్ని భారీ సినిమాలు రావాల్సి ఉంది.